Site icon NTV Telugu

BJP National Executive Meeting: కేంద్ర‌మంత్రికి చేదు అనుభ‌వం.. గెస్ట్ హౌస్ కు తాళం

Sanjeev Balyan Bjp

Sanjeev Balyan Bjp

తెలంగాణలో కుటుంబ పాలన కొన‌సాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అన్నారు. మెద‌క్ జిల్లాలో శనివారం ఉదయం కేంద్రమంత్రి గెస్ట్‌హౌజ్‌కు వచ్చినప్పటీకీ ఆర్‌అండ్‌బీ అధికారులు తాళం తీయని పరిస్థితి నెల‌కొంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ పథకాలు తెలంగాణలో అమలు చేయడం లేదని మండిప‌డ్డారు. కాగా.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని త‌లిపారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పథకాలు అమలు అవుతున్నాయని, పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ సర్కారు ట్యాక్స్ తగ్గించడం లేదని మండిపడ్డారు. అంతే కాకుండా.. తెలంగాణలో రాజరికం అమల్లో ఉందా అని కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ ప్రశ్నించారు.

అయితే మెద‌క్ జిల్లాలో నేడు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ గెస్ట్‌హౌజ్‌కు వచ్చినప్పటీకీ ఆర్‌అండ్‌బీ అధికారులు తాళం తీయని పరిస్థితి నెల‌కొంది. దీంతో బీజేపీ శ్రేణులు తాళం పగలకొట్టి కేంద్ర మంత్రిని గెస్ట్ హౌజ్‌లోకి తీసుకెళ్లారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా.. గెస్ట్ హౌజ్‌లో కనీసం నీళ్లు కూడా అందుబాటులో ఉంచని వైనం ఆశ్చర్యానికి గురిచేసిందని మండిప‌డ్డారు. కేంద్రమంత్రి వచ్చినప్పటికీ ప్రోటోకాల్ పాటించని ఆర్‌అండ్‌బీ అధికారులపై బీజేపీ శ్రేణులు మండిప‌డ్డారు.

BJP National Executive Meeting: 2014 కన్నా ముందే తెలంగాణ వచ్చేదా?

Exit mobile version