NTV Telugu Site icon

Central Government: చనిపోయిన తొమ్మిదిన్నరేళ్లకు UDID కార్డు.. షాక్‌లో కుటుంబ సభ్యులు

Udid Cord

Udid Cord

Central Government: ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థల పనితీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనదేశంలో ఏదైనా సరే పని అంత త్వరగా ఏమీ చేయలేమనే విమర్శలు వస్తుంటాయి. పనులను మందకొడిగా జరుతాయని ఏ పని అయినా సులువుగా పరిస్కారం కాదని టాక్ ఉంది. అయితే తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం(70) ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వికలాంగుల గుర్తింపు (యూడీఐడీ) కార్డు వచ్చింది. ఆ కార్డు చూసి గంగరాజం కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఇది ఎలా జరగిందని ప్రశ్నలు వేసుకుంటూ ఆశ్చర్యానికి లోలనయ్యారు. ఇది నిజంగానే గంగరాజం కార్డేనా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివరకు గంగరాజం యూడీఐడీ కార్డు అని తేలడంతో షాక్ తిన్నారు.

Read also:  Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా పోరు.. కనిపించకుండా పోయిన నేపాలీలు

అసలు కథ ఇదీ..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం కుటుంబం నివాసం ఉంటున్నారు. గంగరాజం వికలాంగుడు. అయితే అతని ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక యూడీఐడీ కార్డు వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే గంగరాజం చనిపోయి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు కావస్తోంది కాబట్టి.. ప్రతి రాష్ట్రం వికలాంగులకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్‌ల ఆధారంగా, యూనివర్సల్ ఐడి, డిసేబిలిటీ సర్టిఫికేట్‌లను అందించడంలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ యుడిఐడి కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు ద్వారా వికలాంగుల పింఛను, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కానీ గంగరాజం చనిపోయి తొమ్మిదిన్నరేళ్లకే కార్డు ఇంటికి వచ్చింది.

తన తండ్రి 2014లో చనిపోయాడని, అప్పటికి వృద్ధాప్య పింఛను పొందుతున్నాడని కుమారుడు మల్లేశం తెలిపాడు. ఈ కార్డు అప్పుడే వచ్చి ఉంటే వికలాంగుల పింఛన్ వచ్చేదన్నారు. ఈ కార్డు కోసం తన తండ్రి ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నాడో, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. అది ముందే వచ్చివుంటే ఇప్పుడు గంగరాజం చనిపోయినా పింఛన్ ఇంట్లో ఎవరికో ఒకరికి వచ్చేదని జీవనాధారం పొందేవారని వాపోయారు. ప్రభుత్వ పెద్దల అలసత్వం మరోసారి బట్టబయలైందని మండిపడ్డారు.
CM Revanth Reddy: ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్