NTV Telugu Site icon

Telangana Elections: తెలంగాణకు ఎలక్షన్ ఫీవర్.. ఈసీ స్పెషల్ ఫోకస్

Telangan Elections

Telangan Elections

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండటంతో సన్నాహక చర్యలపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యారు.

Read Also: Uttar Pradesh: ఇస్లాంలోకి మారాలని లవర్ ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య..

ఓటర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులతో సహా ఎలక్ట్రోరల్ రోల్స్ అప్‌డేషన్‌లను సమీక్షించిన వ్యాస్, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)ల సమగ్ర జాబితా సిద్ధం చేసి అప్డేట్ చేయాలని సీఈవోకు ఆదేశించారు. జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎంలు)లను మొదటిస్థాయి తనఖీలను ప్రారంభించాలను రాష్ట్ర అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల కోసం రెండు రోజుల వర్క్ షాప్ షెడ్యూల్ చేయాలని ఆదేశించారు.

Show comments