NTV Telugu Site icon

TRS Turns BRS: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. సీఈసీ ఆమోదం

Trs Turns Brs

Trs Turns Brs

Central Election Commission Approved TRS As BRS: అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేయడం.. మరుసటి రోజే ఆ తీర్మానం ప్రతిని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే! ఇన్ని రోజులపాటు ఈ తీర్మానం విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచిన సీఈసీ.. ఎట్టకేలకు ఈరోజు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేసీఆర్‌కు సీఈసీ అధికారికంగా లేఖ పంపింది. ఈ నేపథ్యంలో.. రేపు (డిసెంబర్ 9) శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితిఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చారు.

V Hanumantha Rao: సజ్జల వ్యాఖ్యలకు వీహెచ్ కౌంటర్.. ఏపీ, తెలంగాణ కలిపే పని కాదు

ఈ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ భవన్‌లో 1:20 గంటలకు తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా కేసీఆర్ సంతకం చేసి, ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం కేసిఆర్ బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని సీఎం కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు కూడా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీగా అవతరించింది కాబట్టి.. ఇకపై సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకుగా పాల్గొననున్నారని తెలుస్తోంది.

Pawan Kalyan: అన్నా.. నీకు దండం పెడతాం.. ఆ పని మాత్రం చేయకు

కాగా.. అక్టోబర్ 5న సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే! తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.