తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్‌ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ నేతలు మూడు రోజలు నిర్వహించ తలపెట్టారు. 15 తేది నుంచి 17వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం, రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు అస్సాం సీఎం హిమంత బిస్వా కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎవరెవరు ఏవిధంగా పుట్టిన రోజలు శుభాకాంక్షలు తెలిపారో క్రింద చూద్దాం.
KCR Birthday: విషెస్ తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు..
