Site icon NTV Telugu

Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డికి ఈసీ నోటీసులు.. సాయంత్రం వరకు గడువు

Rajagopal Reddy

Rajagopal Reddy

Rajagopal Reddy: మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. టీఆర్‌ఎస్ నేత సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో ఈసీఐ స్పందించింది. కోమటిరెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ రాజ్ గోపాల్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సాయంత్రం తరువాత సమాధానం రాకుంటే రాజగోపాల్ రెడ్డి పై త‌గు నిర్ణయం తీసుకుంటామ‌ని ఈసీ హెచ్చరించింది.

Read also: Gujarat Cable Bridge: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన.. 132కి చేరిన మృతుల సంఖ్య

అయితే.. సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల రెడ్డి నగదు బదిలీ చేసినట్లు ఈసీకి ఆధారాలతో టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి ఓట‌ర్లకు పంచ‌డానికే ఈ న‌గ‌దు బ‌దిలీ చేశార‌ని ఫిర్యాదులో టీఆర్ఎస్ పేర్కొంది. కోమ‌టి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్రమంగా న‌గ‌దు బ‌దిలీ చేశార‌ని వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌ల‌పై నోటీసులు ఇచ్చిన‌ట్లు ఈసీ తెలిపింది. అయితే.. తాము జారీ చేసిన నోటీసుల‌ను ఆల‌స్యం కాకుండా రాజ‌గోపాల్ రెడ్డికి అందజేయాల‌ని రాష్ట్రప్రధాన ఎన్నిక‌ల అధికారి (సీఈవో).. మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ అధికారుల‌ను ఆదేశించింది.
Gold Seized at Pantangi Toll Plaza: లేడీలు కాదు కిలాడీలు..

Exit mobile version