NTV Telugu Site icon

Breaking News : రక్షకులే భక్షకులవుతున్నారా.. సీసీఎస్‌ ఎస్సైపై రేప్‌ కేసు..

Police Harassed

Police Harassed

ఏ సమస్యవచ్చిన రక్షించాల్సిన పోలీసులే భక్షకులవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు నిదర్శనం ఇటీవల చోటు చేసుకు సీఐ నాగేశ్వర్‌ రావు ఘటనే. ఈ ఘటనను మరవకముందే ఇప్పుడు మరో పోలీసులు నిర్వాకం బయటకు వచ్చింది. మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ ఓ యువతితో తనకు పెళ్లికాలేదంటూ.. సహజీవనం చేశాడు. అయితే.. పంచాయతి సెక్రటరీగా పనిచేస్తున్న సదరు యువతిని మభ్యపెట్టి పెళ్లికాలేదంటూ రిలేషన్‌షిప్‌ చేస్తూవచ్చాడు. అయితే ఇటీవల ఎస్సై విజయ్‌కి వివాహం జరిగినట్లు సదరు యువతికి తెలియడంతో విస్తుపోయింది. దీంతో.. రిలేషన్షిప్ ను ఇదే విధంగా కొనసాగిద్దాం. నువ్వు పెళ్లి చేసుకోమని యువతికి చెప్పాడు విజయకుమార్. ఈ నేపథ్యంలో.. విజయ్‌కుమార్‌ను తన భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి కోరగా.. పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధం కొనసాగిద్దామంటూ ఎస్ఐ విజయ్‌కుమార్‌ యువతపై ఒత్తిడి చేశాడు.

CI Nageshwar Rao : సీఐ నాగేశ్వర్‌రావుపై మాజీ ఎంపీ విసుర్లు..

ఈ క్రమంలోనే ఎస్సై విజయ్‌ ఒత్తిడి భరించలేక సదరు యువతి మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా.. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై విజయకుమార్ ని సస్పెండ్ చేస్తూ సీసీ మహేష్ భగవత్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ఎస్సై విజయ్ కుమార్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని మల్కాజిగిరి ఏసీపీని సీపీ మహేష్ భగవత్ ఆదేశించారు. అయితే.. గతంలోనూ ఒకసారి విజయ్‌ సస్పెండ్‌ అయినట్లు తెలుస్తోంది.

 

Show comments