Site icon NTV Telugu

Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్‌.. గజ్వేల్‌లో కేసు నమోదు

Chikoti Praveen

Chikoti Praveen

Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్‌ రావడంతో హాట్ టాపిగ్ గా మారింది. చీకోటి ప్రవీణ్ పై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా నిన్న గజ్వేల్ పట్టణానికి వచ్చి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేశారు గజ్వేల్ పోలీసులు.

గజ్వేల్ పట్టణంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సిద్దిపేట సీపీ శ్వేత స్పందించారు. గజ్వేల్‌లో నిన్న, మొన్న జరిగిన ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసినట్లు సీపీ శ్వేత మీడియా సమావేశంలో తెలిపారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఎలాంటి అనుమతి లేకుండా నిన్న గజ్వేల్ పట్టణానికి వచ్చి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గజ్వేల్‌లో ప్రశాంత వాతావరణం ఉందని.. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలన్నారు. నిన్న (మంగళవారం) శివాజీ విగ్రహం ముందు మద్యం మత్తులో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఈ ఘటనతో గజ్వేల్‌లో ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకున్న స్థానికులు శివాజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరిగి వస్తుండగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో సందీప్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
TS Hig Court: ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం.. హైకోర్టు సంచలన తీర్పు

Exit mobile version