NTV Telugu Site icon

MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..

Mp Arvind Kumar

Mp Arvind Kumar

MP Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎన్నికల ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి విజయేంద్రరావు ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారంలో అరవింద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారారని, జగిత్యాల పీఎఫ్‌ఐకి అడ్డంకిగా మారారని ఫిర్యాదు చేశారు. మరియు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. ఎంపీపీపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Read also: Pawan kalyan : నా భార్యను తిట్టారు.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..

అరవింత్ కేసులు ఇవే..

3 జనవరి 2022లో..

నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అరవింద్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 55 (2), 506 కింద కేసు నమోదు చేశారు.ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది నవంబర్ 8న బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Read also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

25 ఆగస్టు 2023న మరో కేసు

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్‌లో జరిగిన ఓ సభలో తాను ఎవరికి ఓటేసినా.. చివరకు గెలుపొందేది తనేనని వ్యాఖ్యానించిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేయడమేనని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్ గుప్తా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అరవింద్ తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారని భరత్ గుప్తా మండిపడ్డారు. అరవింద్ వ్యాఖ్యలతో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లైక్ ఖాన్, నాంపల్లి కోర్టు న్యాయవాదులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్