Carden search: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పావళి ఆధ్వర్యంలో అదనపు డీసీపీ, ఒక ఏసీపీ, 11 మంది సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నలుగురు పాత నేరస్తులను గుర్తించారు. అలాగే సరైన పత్రాలు లేని నాలుగు వాహనాలు, రెండు బెల్టు షాపులను గుర్తించిన పోలీసులు 400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Read also: Manipur: మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. రెండు స్పెషల్ ఫ్లైట్స్ సిద్దం
ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. మస్తాన్ నగర్ లో 11 సెర్చ్ పార్టీలు, 5 కటాఫ్ పార్టీలు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితులను, వాహనాలను, దుకాణాలను సోదాలు చేశారు. రెండు బెల్టుషాపులు, అక్రమంగా గ్యాస్ నింపుతున్న దుకాణం, క్రాకర్లు నిల్వ ఉంచిన దుకాణాన్ని గుర్తించారు. 400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురు పాత నేరస్తులను గుర్తించామని, మిగితా వారి గురించి తెలియాల్సి ఉందని డీసీపీ తెలిపారు. అక్రమ మద్యం బాటిళ్లను విక్రయిస్తూ బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Neha Shetty: రాధిక నిన్నలా చూస్తుంటే మైండ్‌లో కిరికిరి షురూ అవుతోంది