111 జీవోను ఎత్తివేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి.. మాట్లాడుతూ.. గతంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 111 జీవో ఎత్తివేతపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు కేసీఆర్ తెలిపారు.
పొల్యూషన్ బోర్డు, అటవీశాఖతో పాటు ఇతరులతో కలిసి ఎట్టిపరిస్థితుల్లో మూసీనది, ఈసా నది జలాశయాలు కలుషితం కాకుండా, గ్రీన్ జోన్‌లు డిక్లర్ చేస్తూ, మాస్టర్ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తూ.. జీవోపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించామన్నారు. కొద్దిరోజులల్లో 111 జీవో ఎత్తివేతపై సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయం అక్కడి ప్రాంత ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
https://ntvtelugu.com/gandhi-hospital-contract-employees-protest/
