Site icon NTV Telugu

హైకోర్టులో బిసినెస్ మేన్ ల డ్రగ్స్ కేసు విచారణ..

హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీ సంబంధాలు పెట్టుకునందున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేడు హై కోర్టులో విచారణకు వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మేన్ లను ను విచారించాల్సిన అవసరం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టోని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్స్, వాట్సప్ మెస్సేజ్ లలో స్వాధీనం చేసుకున్నామన్న పీపీ.. సెక్షన్ 27 ప్రకారం డ్రగ్స్ వినియోగదారుల పై కేసులు నమోదు చేశామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. సెక్షన్ 27 అనేది బెయిల్ బుల్ అఫెన్స్.. ఇందులో కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని వ్యాపార వేత్తల తరపు న్యాయవాదులు వాదించారు. అరెస్ట్ చేసి రోజులు గడుస్తున్నా.. ఎలాంటి పురోగతి కేసులో లేదని వ్యాపార వేత్తల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. నిందితులందరికి బెయిల్ మంజూరు చేయాలని వ్యాపార వేత్తల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే అరెస్ట్ అయిన వారందరు కేవలం వినియోగదారులు మాత్రమేనని వ్యాపార వేత్తల తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. అయితే ఇరువాదనలు పూర్తి కావడంతో హై కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Exit mobile version