తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సామాన్యుల, విధ్యార్థులు ఈభారాన్ని మోపలేని స్థితిలో నెట్టుకొస్తున్నా అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ నష్టం వస్తుందని మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమమయ్యింది. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని, అమలు చేసేందుకు సిద్దంగా వున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, టికెట్ ధరల పెంపుపై పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. డీజిల్ సెస్ రూపంలో రెండుసార్లు పెంచగా, టికెట్ ధరలు ఉండవని భావించారు. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు 30 శాతం టికెట్ ధరలు పెరుగనున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు వర్తిందని టాక్.. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్ ధర 20 శాతం వరకు ఉండనుంది. డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి బస్సులకు 20 శాతం పెంపు ఉండనుంది. దీంతో రోజువారీ నష్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు.
ఇలా పెంచినా సగటున కిలోమీటరుకు టికెట్ పై రూ. 2 నుంచి రూ. 3 వరకు పెరుగుతుందని అధికారులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీ సమక్షంలో సమీక్షించినట్లు తెలుస్తోంది.ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్ కూడా గతంలోనే ప్రకటించారు.చార్జీపై రూ.5 వరకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మార్పులు చేసి, మరోసారి సీఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై ఆమోదం వస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్ టికెట్ ధరలు మరింత పెరుగనున్నాయి.
India Corona Cases : మళ్లీ కరోనా కల్లోలం.. 17 వేలు దాటిన కేసులు..
