Site icon NTV Telugu

Bus fire in Suryapet: బైకును ఢీ కొట్టిన రాజధాని బస్సు.. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు

Suryapet

Suryapet

Bus fire in Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న బైక్‌ కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్‌ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.

ఎప్పటిలాగే హైదరాబాద్‌ మియాపూర్‌ నుండి విజయవాడకు బస్సులు బయలు దేరింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్దకు రాజధాని బస్సు రాగానే ఎదురుగా బైక్‌ వెళుతున్న గమనించని డ్రైవర్‌ బస్సును స్పీడ్‌ తోనే బైక్‌ ను ఢీకొట్టాడు. దీంతో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ అలర్ట్‌ అయి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపాడు. డ్రైవర్‌, క్లీనర్‌ కూడా సురక్షింతంగా ప్రాణాలు కాపాడుకోగలిగారు. బస్సులో వున్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గురైన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను ఛేంజ్‌ చేశారు. ఫైర్‌ ఇంజన్‌ ను సమాచారం అందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులను మరొక బస్సులో వారి గమ్య స్థానాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బైక్ లో వెళుతున్న వ్యక్తిని చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వివరాలు ఆరాతీస్తున్నారు పోలీసులు.
Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..

Exit mobile version