సదర్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేళ ఓ దున్నపోతు వీరంగం చేసింది. ఖైరతాబాద్ చౌరస్తా లో దున్నపోతు గంట సేపు హల్ చల్ చేసింది. సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా తాడు తెంపుకొని పరుగు తీసింది ఓ దున్నపోతు. రోడ్డుపై వున్న స్కూటీనీ కొంత దూరం లాక్కెళ్లి పోయింది దున్నపోతు. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎట్టకేలకు దున్నపోతును బంధించారు యాదవులు. ఏటా దీపావళి అనంతరం హైదరాబాద్ లో సదరు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
బ్రేకింగ్:ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతు వీరంగం
