తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతుంది.. గులాబీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.. అయితే, బీఆర్ఎస్ గుజరాత్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పోటీచేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేయబోతుందన్నారు.. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రచారం మొదలు పెట్టాయి. ఎన్నికల తేదీలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా తరచు రాష్ట్రంలో పర్యటిస్తూ వచ్చారు.. అయితే, ప్రస్తుతం ఆయన భారత్ జోడో యాత్రలో ఉన్నారు.. మరోసారి అధికారంలోకి వచ్చి తన కంచుకోటను కాపాడుకోవాలని బీజేపీ శ్రేణులు గట్టిగా ప్రయత్నం చేస్తుండగా.. 27 ఏళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలన హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.. ఇక, ఢిల్లీకి తమ పార్టీ పరిమతం కాదంటూ.. రాష్ట్రాల విస్తరణపై గురిపెట్టిన ఆప్ చీప్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని అందించారు.. ఇప్పుడు ఆయన గురి గుజరాత్‌పై పడింది.. వరుస పర్యటనలు, ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
Read Also: KCR National Party: అథితులకు కేసీఆర్ అల్పాహార విందు.. దగ్గరుండి వడ్డించిన కేటీఆర్