Site icon NTV Telugu

BRS Party: ఈనెల 13న చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ..!

Brs Party

Brs Party

BRS Party: ఈ నెల 13 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. చేవెళ్ల బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం మని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. బస్సు యాత్రల ద్వారా కేసీఆర్ ప్రతి నియోజకవర్గంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చనే నిర్ణయంతోనే ప్రచారానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. బహిరంగ సభలు లేకుంటే ఖర్చులు తగ్గించుకునే అవకాశంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నాట్లు పార్టీనేతలు తెలిపారు.

Read also: Allu Arjun Birthday: హ్యాపీ బ‌ర్త్‌డే బావ.. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరో!

పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేయాలనే యోచనలో కేసీఆర్ వున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ నెల 13న చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శ్రేణులకు సెరి లింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసిన అనుభవం ఉందని, తాను ఎంపీగా ఎన్నికైతే అన్ని వర్గాలకు అండగా ఉంటానన్నారు.

Read also: MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట..!

ప్రజలకు సేవ చేయాలనే ఎన్నికల్లో నిలబడ్డానని, ప్రజలు గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపిస్తామని ప్రజాప్రతినిధులు, ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టాలని కోరారు. ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభకు లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి

Exit mobile version