Delhi Live: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

Brs Office

Brs Office

ఢిల్లీలోని స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభోత్సవం జరుగుతోంది. ముందుగా కార్యాలయ ఆవరణలో రాజశ్యామ‌ల యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.