NTV Telugu Site icon

Malothu Kavitha: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత

Malosth Kavitha

Malosth Kavitha

Malothu Kavitha: పార్టీ మారడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత క్లారిటీ ఇచ్చారు. తనపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు మాలోతు కవిత. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా కార్యాచరణతో ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్మికులను ఆదుకునే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోతుందన్నారు. తాగు, సాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని సూచించారు.

Read also: Komatireddy: హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాలోత్ కవిత.. నవంబర్ 4, 2014 న, తన తండ్రి రెడ్యా నాయక్‌తో కలిసి కాంగ్రెస్ నుండి BRS లో చేరారు. 2019లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బలరానాయక్‌పై 1.50 లక్షల మెజార్టీతో గెలుపొంది తన సత్తా చాటారు. 2019లో 17 ఎంపీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, గెలిచిన ఏకైక మహిళా ఎంపీగా కవిత మాలోత్ చరిత్ర సృష్టించారు. 19 సెప్టెంబర్ 2019న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలుగా, 9 అక్టోబర్ 2019న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అలాగే.. 26 జనవరి 2022న ఆమె అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లా బి.ఆర్.ఎస్. లంబాడా నుంచి దేశంలోనే తొలి మహిళా ఎంపీగా గుర్తింపు పొందారు. మహబూబాబాద్ పార్లమెంట్ నేతలతో అనుబంధం ఉంటూ పరిపాలనను సమర్థంగా నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి మళ్లీ ఆమె అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.
Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Show comments