Palla Rajeshwar Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాయిదా వేయలేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగంగా వెల్లడైన సంగతి తెలిసిందే. BRS ఎమ్మెల్యేల ఫిర్యాదు నేపథ్యంలో స్పీకర్‌కు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారు.
Pawan Kalyan : ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు.. ఆటంకాలు కల్పించవద్దు!
విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల తరుపున వచ్చిన అడ్వకేట్‌లు వివరణ ఇవ్వడంలో తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించారని, అసంబద్ధ ప్రశ్నలు వేస్తున్నా BRS నేతలు ఓపికతో సమాధానాలు ఇచ్చారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. “నిస్సందేహంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదని వారు చెబుతున్నారు, కానీ పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పాం” అని ఆయన చెప్పారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటామని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 1న BRS అడ్వకేట్‌లు ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్ లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.
Pawan Kalyan : ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు.. ఆటంకాలు కల్పించవద్దు!
