Site icon NTV Telugu

Kaushik Reddy: మాణికం ఠాగూర్ పై కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పాం..

Mla Kaushik Reddy

Mla Kaushik Reddy

Kaushik Reddy: మానికం టాగూర్ పై మేము సొంత ఆరోపణలు చేయలేదని కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లక్షన్నర పైగా సర్కార్ ఉద్యోగాలు ఇస్తే… జనం కు ఎక్కలే అని మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇస్తేనే కదా .. మీరు 4 వ తేది వరకు జీతాలు ఇచ్చింది అని అన్నారు. ఎన్ని రోజులు గత బీఆర్ఎస్ సర్కార్ పై అబద్ధాలు చెబుతారు ? అంటూ మండిపడ్డారు. జేఏసీ పేరు మీద బీఆర్ఎస్ పై కోదండ రామ్ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానికం టాగూర్ పై మేము సొంత ఆరోపణలు చేయలేదు.. కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పామని అన్నారు.

Read also: IT Sector Jobs : జాబ్ కోసం వెతుకుతున్న స్టూడెంట్స్‎కు షాక్.. క్యాంపస్ హైరింగ్‎కు నో చెప్పిన ఐటీ కంపెనీ

కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి, కోదండరాం అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో లక్షా 60వేల 63వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో ఇప్పటికే చాలాసార్లు చెప్పామని గుర్తు చేశారు. 42 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా, భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, ఇతర రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూచించారు.

Exit mobile version