Kaushik Reddy: మాణికం ఠాగూర్ పై కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: మానికం టాగూర్ పై మేము సొంత ఆరోపణలు చేయలేదని కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లక్షన్నర పైగా సర్కార్ ఉద్యోగాలు ఇస్తే… జనం కు ఎక్కలే అని మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇస్తేనే కదా .. మీరు 4 వ తేది వరకు జీతాలు ఇచ్చింది అని అన్నారు. ఎన్ని రోజులు గత బీఆర్ఎస్ సర్కార్ పై అబద్ధాలు చెబుతారు ? అంటూ మండిపడ్డారు. జేఏసీ పేరు మీద బీఆర్ఎస్ పై కోదండ రామ్ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానికం టాగూర్ పై మేము సొంత ఆరోపణలు చేయలేదు.. కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పామని అన్నారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్‌లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి, కోదండరాం అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో లక్షా 60వేల 63వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో ఇప్పటికే చాలాసార్లు చెప్పామని గుర్తు చేశారు. 42 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా, భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, ఇతర రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!