NTV Telugu Site icon

Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు

Kaleru Venkatesh

Kaleru Venkatesh

Big Breking: అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్ నియోజకవర్గం లో శుక్రవారం సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొందరు కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ.. గ్యాస్ బెలున్లు గాలిలో వదిలే సమయంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చడంతో నిప్పు రవ్వలు చెలరేగి బెలున్ల పై పడి ఒక్క సారిగా బెలూన్లు పెలిపోయాయి. వీటి నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్‌లపై పడటంతో అవి పేలిపోయాయి. దీంతో మంటలు రావటంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే, కార్యకర్తలు అక్కడనుంచి పరుగులు తీసారు. పరిగెత్తే క్రమంలో ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు కిందకు పడిపోయారు. దీంతో స్వల్ప గాయాలయ్యాయి.
Modi-Tamilisai Wishes: సీఎం కేసీఆర్‌ 69వ జన్మదినం.. ప్రధాని, గవర్నర్‌ సహా ప్రముఖుల విషస్‌

Show comments