Site icon NTV Telugu

BRS vs Congress: తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Brs Cong

Brs Cong

BRS vs Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా కృష్ణా నదీ జలాల వివాదం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ప్రకటించింది. దీంతో అటూ అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి.

Read Also: Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ

అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు (జనవరి 3) ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో గులాబీ పార్టీ శ్రేణులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. నేటి అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా.. దీనికి కౌంటర్ గా తెలంగాణ భవన్‌లోనే కృష్ణా నదీ జలాల వివాదం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.

Exit mobile version