NTV Telugu Site icon

K. Keshava Rao: సీఎం రేవంత్‌ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..

K.keshavarao

K.keshavarao

K. Keshava Rao: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశరావు భేటీ ముగిసింది. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కేశవరావు ఈరోజు రేవంత్ రెడ్డితో 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. రేపు కేశవరావు, గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు నిర్ణయించుకుట్లు ఈ నెల 28న మీడియాతో చిట్ చాట్‌లో కేశ‌వ రావు ఈ విష‌యాన్ని తెలిపిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్‌లో చేరేందుకు తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా కేశ‌వ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి వివ‌రించారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం కేశవరావు మాట్లాడుతూ..

Read also: Young Indians: భారత్లో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ఐఎల్వో హెచ్చరిక

జీహెచ్‌ఎంసీ మేయర్ కేశరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. అయితే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ కు కావ్య కవిత లేఖ రాశారు. కడియం శ్రీహరి కూడా బీఆర్‌ఎస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత వారం జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో కలిసి కేశవరావును కలిశారు. వీరిద్దరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Danam Nagender: కన్ఫూజన్‌లో దానం..! మారనున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి..