Site icon NTV Telugu

Kadiyam Srihari: పదవిలో ఉన్నా లేకున్నా..ప్రజలకు తోడుగా ఉంటా

Kadiyam 1

Kadiyam 1

తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ నేతలు ఎవరో కాదు.. కడియం శ్రీహరి, రాజయ్య. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్మడపల్లి (ఐ) లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను పదవి ఉన్నా లేకున్నా నా శక్తి మేరకు ప్రజలకు తోడుగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నా అన్నారు శ్రీహరి.

Read Also: Tunisha Sharma: సీరియల్ నటి ఆత్మహత్యలో “లవ్ జిహాద్” కోణం.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా పనిచేసే ఆలోచన ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నామా , దాచుకున్నామా అనేది కాకుండా అధికారాన్ని ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలని హితవు పలికారు. దాదాపు 15 సంవత్సరాలవుతుంది… నేను ఎమ్మెల్యేగా లేను. మీ దగ్గరకు రాలేదు కానీ నన్ను చూడగానే మీరు చేసిన అభివృద్ధి మాత్రమే అని ప్రజలు నాకు చెప్తుంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? ఏ వృత్తిని ఎంచుకున్నా ఏ రంగంలో ఉన్నా ప్రజలకు సేవ చేసి ఆ సంతృప్తి పొందాలన్నారు కడియం శ్రీహరి.

Read Also: Tunisha Sharma: సీరియల్ నటి ఆత్మహత్యలో “లవ్ జిహాద్” కోణం.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

Exit mobile version