NTV Telugu Site icon

BRS: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. 108 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ ఘన విజయం..

Navaan

Navaan

BRS: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందడం విశేషం. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమకు మళ్లీ స్థానం దక్కడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కాశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. మార్చి 28న ఎన్నికలు జరిగాయి.బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు.

Read also: Manamey : పిఠాపురంలో శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉంది. మొత్తం 1437 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా.. కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది. పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య 1,416 కాగా.. బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652, స్వతంత్ర అభ్యర్థి 1 సాధించారు.
Mahabubnagar MLC Bypoll: మహౠబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌.. బీఆర్ఎస్ విజయం..