NTV Telugu Site icon

MLC Elections : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

Brs Mlc Nominations

Brs Mlc Nominations

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ ధాఖలు చేశారు. అభ్యర్థులు దేశ‌ప‌తి శ్రీనివాస్, న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను అసెంబ్లీ లాబీల్లోని రిటర్నింగ్ ఆఫీసర్ కు స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి హాజరయ్యారు. అంతకుముందు గ‌న్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అభ్యర్థులు నివాళులు అర్పించారు. కాగా, గురువారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.ఈ నెల 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు

సిద్దిపేట జిల్లాకు చెందిన దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఉపాధ్యాయుడిగా తన జీవితం ప్రారంభించారు. తెలంగాణ చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తన కలంతో, గళంతో.. ఉద్యమానికి తన వంతు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంవో కార్యలయం ఓఎస్డీగా వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు భాషా ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. దేశపతి శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇక, చల్లా వెంకట్రామిరెడ్డి.. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనవడు. గతేడాది డిసెంబర్ 9న బీఆర్ఎస్ లో చేరారు. 2004లో అలంపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్‌ పార్టీలో చేరారు. అయితే, అలంపూర్‌ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్లో చేరారు.

YCP MLA Nominations: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యుర్థుల నామినేషన్‌ దాఖలు

ఇక, కుర్మయ్యగారి నవీన్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ఆయన 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పుడు ఆయనకు అవకాశం దక్కలేదు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఏర్పడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించాడు. ఆయన 2019 జూన్ 7లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జూన్ 19న ప్రమాణస్వీకారం చేశారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. న్యూక్లియర్ ప్లాంట్‌లో నిలిచిన విద్యుత్..