NTV Telugu Site icon

Bowenpally Vinod Kumar: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది..

B.vinod Kumar

B.vinod Kumar

Bowenpally Vinod Kumar: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ లో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తాడన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడిందన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడన్నారు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయన్నారు. పార్లమెంట్ లో గళం విప్పాలంటే నేను గెలువాలన్నారు. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Rekha Jhunjhunwala: 24 గంటల్లో రూ.800 కోట్ల నష్టం.. కారణాలేంటి..?

తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇది కొత్త ప్రభుత్వం కాదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుందన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు. మళ్లీ గెలిస్తే అమలు చేయడన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడుతుందన్నారు. అభివృద్ధి కావాల్నా విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. నేను గెలిచిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నారు. నేను చెప్పింది చేసి చూపించానని తెలిపారు. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ లు అని మండిపడ్డారు. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్‌ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. దీంతో ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు.
NEET 2024: తమ్ముడిని డాక్టర్‌ చేయాలని నీట్‌ పరీక్ష రాసిన ఎంబీబీఎస్ విద్యార్థి.. కానీ?