Rangareddy Crime: దేశంలో ఎక్కడో ఒకచోట, ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇది ఆగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. చట్టం తెచ్చిన చట్టాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఆగడం లేదు. స్త్రీ కనిపిస్తే చాలా కామోన్మాదులు రెచ్చిపోతున్నారు రెచ్చిపోతారు. బాధితులు బయటకు వచ్చేంత ధైర్యం ఉండరన్న నమ్మకం కామోన్మాదులకు ఆయుధంగా మారింది. దీంతో కామపిశాచులు చలరేగిపోతున్నారు. మహిళ కనిపిస్తే కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. చట్టాలు అమల్లోకి వచ్చిన దిశా వంటి సంఘటనలు వారి కార్యకలాపాలను ఆపడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Read also: Kishan Reddy: 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం
రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్‌లో కనిపించిన అమానవీయ చర్య మైనర్ బాలికను గర్భవతిని చేసిన అతని సమీప బంధువు కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గర్భవతి అని చెప్పారు. తనపై ఎవరు ఇలా చేశారంటూ బాలికపై తల్లి ఒత్తిడి చేసింది. కన్నీరు పెట్టుకుంది. తనకూతురు అభం శుభం తెలియని చిన్న పిల్లఅని తనపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడేందుకు ఎలా మనసు వచ్చిందని గుండెలు బాదుకుంది. తన కూతురి జీవితం ఇప్పుడు ఎలా? అంటూ వాపోయింది. తనకూతురికి దీనికి కారణం ఎవరు అంటూ మళ్లీ అడగడంతో.. చివరకు ఆమైనర్ బాలిక నోరు విప్పింది. తనకు 3 నెలల నుంచి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మరెవరో కాదు తన బావ అని చెప్పింది. ఇంట్లో ఎవరికైనా చెప్పకూడదని బెదిరించాడని తెలిపింది. దాంతో తను ఇంట్లో చెప్పలేకపోయానని తల్లిని పట్టుకుని ఏడ్చింది. వెంటనే బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు