NTV Telugu Site icon

Bride commits suicide: నవ వధువు ఆత్మహత్య.. వరుడిపై తండ్రి ఫిర్యాదు

Nizamabad Crime

Nizamabad Crime

Bride commits suicide in Nizamabad: పెళ్లి మండపంలో సందడి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి రావడానికి నవ వధువు ముస్తాబవుతోంది. ఇంతలోనే విషాధ ఘటన దిగ్భాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు వధువు రవళికి మ్యారేజ్ జరగనుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ వున్న వధువు ఇంట్లోకి వెళ్లిన వధువు రవళి పెళ్లికి ముస్తాబై ఇంట్లోనే సూసైడ్ చేసుకుంది. పెళ్లికి సమయం అవుతుందని కుటుంబ సభ్యులు డోర్ లాక్ చేయడంతో ఎంత సేపటికి రవళి తలుపులు తీయలేదు. దీంతో భయభ్రాంతులైన కుటుంసభ్యులు డోర్ ను బద్దలు కొట్టి గది తలుపులు తీయగానే రవళి ఫ్యాన్ కు వేళాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో.. కుటుంబ సభ్యులు దిగ్భాంతికి గురయ్యారు. రవళి చనిపోయే కొద్దిసేపటి ముందు వరుడు, వధువుతో పాటు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ తో కూడా డ్యాన్స్‌లు చేశారు. అప్పటి వరకు తమ కళ్లముందే వున్న వధువు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నింపింది.

Read also: CJI: మైనర్ల సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. అది నేరమే..

అయితే.. నవ వధువు ఆత్మహత్య ఘటనలో వరుడు పై కేసు నమోదు చేశారు పోలీసులు. వధువు ఆత్మహత్య చేసుకునే ముందే వరుడితో ఓసాంగ్‌ కి స్టెప్పులు కూడా వేశారు. అయితే నవ వధువు రవళి ఆత్మహత్యకు ముందు చివరి సారిగా వరుడితో ఫోన్ కాల్ మాట్లాడినట్లు తండ్రి పేర్కొన్నారు. వరుడు వేధింపులే ఆత్మహత్య కు కారణమని రవళి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు 306 కేసు నమోదు చేశారు నవిపేట పోలీసులు. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నం కాగా.. పెళ్లి కూతురుగా ముస్తాబై వధువు రవళి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. గ్రామంలో నిశ్శబ్దం అలుముకుంది. కన్నెరికం చేసి అత్తగారింటికి పంపాల్సిన కూతురికి కాటకాలతో రవళి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వివాహితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BREAKING: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు అస్వస్థత

Show comments