NTV Telugu Site icon

Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.

Dana Kishore

Dana Kishore

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువుల కాపాడడం కోసం హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, మీడియాలలో కూల్చివేతలపై వస్తున్న వార్తాలపై ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన పై ప్రభుత్వ లక్ష్యంను సవివరంగా చెప్పాలనే ఉద్దేశ్యంతోనే మీడియా ముందుకు వచ్చామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి లండన్ థేన్స్ ను, పలు దేశాల్లోని నదులను చూసి వచ్చామని అన్నారు. ఇటీవల సెక్రటేరియట్ ప్రాంతంలో 20 నిమిషాల్లో 9.1 సెంటిమీటర్ల వర్షం కురిసిందని, గతంలో తెలంగాణలో వర్షాలు పడేవి కాదని, గత నాలుగైదు సంవత్సరాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. మూసీ అభివృద్ధి సుందరికరణ కోసం కాదని, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం రావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. మూసీలో వరదలు వస్తే అక్కడి వాళ్ళను పునరావాస కేంద్రాలకు పోలీసుల సహాయంతో తరలిస్తామని, ఇప్పుడు పురాణపుల్ బ్రిడ్జి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.

అంతేకాకుండా..’ఇతర దేశాలలో నదులు చాలా సుందరంగా, సౌకర్యవంతంగా ఉన్నాయి. సీయోల్ అనే ప్రాజెక్టును చూపించేందుకు నగరంలోని ప్రజాప్రతినిధులను విజిట్ కు తీసుకు వెళతాం. మూసీలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టాం. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న చెరువులను 3800 కోట్లతో శుద్ధి చేయబోతున్నాం. 10 వేల కోట్లతో మురుగు నీటి వ్యవస్థను శుద్ధి చేస్తాం. మాస్టర్ ప్లాన్ ద్వారా త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. రివర్ బెడ్ లోని ప్రజలు ప్రతీ వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు డబుల్ బెడ్రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలు చేసింది ఆక్రమణ అని చెప్పడం లేదు. ఇంకా ఏమి అనడం లేదు. గత 30 సంవత్సరాలుగా మూసీ రివర్ బెడ్ ప్రజలతో కలిసి పని చేసిన ngo లతో ఒక సమావేశం ఏర్పాటు చేసాం, వారితో ఒక కమిటీ వేశాం. ప్రతీ కుటుంబాన్ని మూసీ నుంచి తరలించిన తర్వాతే మూసి పనులు చేపడతాము

మూసీ రివర్ బెడ్ లోని మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. మూసీలో 10 వేల ఇండ్లను గుర్తించి 14 స్థలాలకు మారుస్తాం. విద్యార్థుల కోసం ఈరోజు నుంచి మూసిలో ఇంటింటి సర్వే స్టార్ట్ చేసాం. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మూసీలో 23 ప్రాంతాల్లో హెల్త్ డెస్క్ లను ఏర్పాటు చేసాం. అక్కడ అన్ని శాఖల అధికారులు అక్కడే ఉంటారు. ఇప్పటివరకు 50 కుటుంబాలు.. ఈరోజు 200 కుటుంబాలను షిఫ్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 20, 30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నాం. అందరం చట్టరీత్యా పని చేస్తున్నాం. అందర్ని కన్న బిడ్డల్లా తీసుకు వెళ్తున్నాం. అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరుగొచ్చు. ఎవర్నీ బలవంతంగా తీసుకు వెళ్లడం లేదు. ఎవర్ని కొట్టడం లేదు. 976 ఇండ్లలో 406 ఇండ్లకు మార్కింగ్ చేశాము. ఇటీవల కురిసిన వర్షాలకు గేట్లు ఎత్తితే మూసీలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు అందుబాటులో ఉన్నాయి. రివర్ ఫ్రెంట్ పక్కనే ఈస్ట్, వేస్ట్ కారిడార్ కడతాం. ఈ కారిడార్ల వల్ల నగరం అభివృద్ధి చెందుతుంది. అన్ని ప్రాంతాలకు తక్కువ సమయంలో రాకపోకలు చేయొచ్చు. రివర్ పక్కన బిజినెస్ కేంద్రాలు వస్తాయి. మూసీ రివర్ సంపదను, వారసత్వ సంపదను తీసుకు వస్తుంది.’ అన దాన కిషోర్‌ మీడియాకు వెల్లడించారు.