NTV Telugu Site icon

Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం అమలు..

Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam : భద్రాద్రి రామ మందిరంలో బ్రేక్ దర్శనం జరగనుంది. నేటి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9:30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులకు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. విరామ దర్శన సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఆలయ కౌంటర్లు, ఆలయ వెబ్‌సైట్‌లో బ్రేక్ దర్శన టిక్కెట్‌లను విక్రయిస్తారు. బ్రేక్ దర్శనం టికెట్ ధర రూ. 200గా ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనం, ఇతర సేవలను నిలిపివేస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

Read also: Sasi Madhanam : పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు రాబోతున్న ‘ శశి మధనం ‘..

అలాగే ప్రధాన ఆలయం, అన్నదాన సత్రం వద్ద 90 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ను ఈఓ ప్రారంభించారు. మరోవైపు దక్షిణ అయోధ్యగా మారుతున్న భద్రాచలం క్షేత్రంలో రామనారాయణపై దశాబ్ద కాలంగా వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ చర్చ తెరపైకి వచ్చింది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కల్యాణమా లేక లక్ష్మీనారాయణ కళ్యాణమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ దశాబ్దంలో చాలా సార్లు శ్రీరామ నవమికి ​​ముందు ఈ విషయం ప్రస్తావనకు వచ్చి ఆ తర్వాత మాయమైపోతుంది.
Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లాలో రెండోరోజు డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన..