Site icon NTV Telugu

Boy Kidnap: కరీంనగర్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం..

Kidnap

Kidnap

కరీంనగర్ జిల్లా రామడుగులో కిడ్నాప్ కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన వాన రాశి వెంకటేష్ చిన్న కుమారుడైన రాంప్రసాద్ (2) ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన గుర్తుతెలియని మహిళ వచ్చి కిడ్నాప్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరుగా విలపించారు. బాబు కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల వారిని అడగగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వారి బాబును ఎవరో మహిళ వచ్చి ఎత్తుకొని ఆటోలో తీసుకెళ్తున్నదని తెలుపగా వెంటనే కుటుంబ సభ్యులు ఆటోను వెంటాడారు. అనంతరం ఆటోను గ్రామంలోని రైల్వే గేట్ వద్ద ఆపి మహిళను నిలదీశారు. దీంతో మహిళ ఎత్తికెళ్ళిన మాట నిజమేనని ఒప్పుకోవడంతో ఆ మహిళను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

Also Read : Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ.. మే 1 నుంచి వరుసగా జీవోలు..!

ఇదిలా ఉంటే..బాలుడి కుటుంబీకులు, ఆటోలో ఉన్న స్థానికులు సదరు మహిళ దగ్గర ఉన్న బాలుడిని తీసుకుని ఆమెను నిలదీశారు. ఎందుకు బాలుడిని తీసుకెళ్తున్నావు అని ప్రశ్నించగా .. బాలుడే తన వెంట వచ్చాడని, ఆస్పత్రికి వెళుతున్నాను… అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పింది. మాది ఈ గ్రామమే అంటూ తన దగ్గర ఉన్న ఐడీ ప్రూఫ్​లను తీసి చూపించింది. మాకు చెప్పకుండా ఎలా తీసుకెళ్తావంటూ… బాలుడి కుటుంబీకులు సదరు మహిళపై విరుచుకుపడ్డారు. బాలుడిని మరొకరికి విక్రయించేందుకే అపహరించిందంటూ దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : MP R. Krishnaiah : అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు , స్కై ఓవర్లు మాత్రమే కాదు

Exit mobile version