Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- ఆర్థిక ఇబ్బందులతో ఆయుధాల చోరీకి మల్లేష్ స్కెచ్
- కోట ఇన్‌ఛార్జ్‌ల సహకారంతో పక్కా ప్లాన్
- సీసీ కెమెరాలు, సెంట్రీ డ్యూటీలపై ముందే రెక్కీ
- ఆయుధాల చోరీలో ఉగ్రకోణం లేదన్న సీపీ సుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ బెల్లా ఫామ్ నిబంధనలను ఉల్లంఘించి ఆయుధాల చోరీకి పాల్పడిన కేసులో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీసులు సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. మల్కాజిగిరి పోలీసులు, ఎస్ఓటీ (SOT), టాస్క్ ఫోర్స్ , ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త దర్యాప్తులో ఈ కేసు గుట్టురట్టయ్యింది. కేసులోని ప్రధాన నిందితుడు మల్లేష్‌ను సెప్టెంబర్ 11న అదుపులోకి తీసుకుని, అతడు గన్నీ బ్యాగుల్లో దాచిన తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. 10 రోజుల పోలీసు కస్టడీ విచారణలో మల్లేష్ నేరచరిత్ర, చోరీ వెనుక ఉన్న పక్కా ప్రణాళిక బయటపడిందని ఆమె వివరించారు.
2025 వరకు మేఘాలయ, జమ్మూ, ఊటీ ప్రాంతాల్లో పనిచేసిన మల్లేష్, అక్కడి నుంచి మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీ అయ్యాడు. గతంలోనూ ఇతనిపై నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రెండు దొంగతనం కేసులు నమోదు కాగా, మొదటి నుంచీ నేరపూరిత మనస్తత్వం కలిగి ఉన్నాడని అధికారులు స్పష్టం చేశారు. ఆర్మీ రిటైర్మెంట్ తర్వాత ఫ్లాట్ కొనుగోలు, సొంత ఇల్లు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఖర్చయిపోవడంతో, ఎలాగైనా త్వరితగతిన ధనవంతుడు కావాలనే ఉద్దేశంతో ఆయుధాల దొంగతనానికి ఒడిగట్టాడు. 2022లోనే కలకత్తాలో సివిలియన్ అయిన బీర్బల్ షా ద్వారా అక్రమ ఆయుధ వ్యాపారి అవల్ దెయ్‌తో పరిచయం పెంచుకుని కంట్రీమేడ్ తపంచాను కొనుగోలు చేసినట్లు తేలింది.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
లోపలి వ్యక్తుల సహకారం.. పక్కా స్కెచ్‌తో నేరం
ఆయుధాల చోరీకి మల్లేష్, మల్లికార్జున, నిరంజన్లు కలిసి ముందే స్కెచ్ వేశారు. బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో తెలిపే వీడియోలను మల్లికార్జున మల్లేష్‌కి పంపగా, వాటి ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన అనుభవంతో, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కోట్ ఇన్-ఛార్జ్ వినోద్, ప్రవీణ్, శేషులకు డబ్బుల ఆశ చూపి తన వైపు తిప్పుకున్నాడు. జూలై 14 నుంచి ఆగస్టు 27 వరకు మల్లేష్, వినోద్‌లు ఒకే లొకేషన్లో ఉన్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. కోట్ ఇన్-ఛార్జ్ వినోద్ సీసీ కెమెరాల పనితీరు, సెంట్రీ డ్యూటీ వేళలు తెలుసుకుని రెగ్యులర్ సమయం కంటే ముందే విజిటింగ్ చేసేవాడు.
ప్లాన్ ప్రకారం స్కూటీపై లోపలికి వెళ్లిన మల్లేష్ ఐరన్ రాడ్‌తో తాళాలు పగలగొట్టి ఆయుధాలను చోరీ చేశాడు. చోరీ పూర్తయిన వెంటనే ప్రవీణ్‌కు ‘కామ్ హోగయా’ అని మెసేజ్ పంపి, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్, మెసేజ్ హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేశాడు. సమాచారం ఇచ్చినందుకుగానూ వినోద్‌కి ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లో రూ. లక్ష నగదును మల్లేష్ అందించాడు. ఆ తర్వాత అనుమానం రాకుండా వినోదే ఒక పిస్టల్ పోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అసలు అనుమానం బలపడింది.
ఉగ్రకోణం లేదు.. ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం
ఈ ఆయుధాల చోరీ కేసులో ఎలాంటి ఉగ్రకోణం (Terror Angle) లేదని సీపీ సుమతి స్పష్టం చేశారు. అయితే, కేసులో భాగస్వామి అయిన శేషు పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు గుర్తించామని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. చోరీ జరిగిన సమయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న అక్రమ ఆయుధ వ్యాపారి అవల్ దెయ్పై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయని, బీర్బల్ షాకు కూడా మల్లేష్ ఆర్మీ ఆయుధాలు తీసుకువస్తాడనే విషయం ముందే తెలుసని విచారణలో తేలింది. అన్ని రకాల సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించామని, ముఠాలోని మిగిలిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!