కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ పై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఫిజిక్స్ పేపర్ లీకేజీ ఘటన, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై సీరియస్ అయ్యింది. ఎస్ యూ పరీక్షల విభాగం అధికారులను వివరణ కోరారు ఛైర్మెన్ పాపిరెడ్డి. సెల్ ఫోన్ ఆధారంగా లికేజీకి పాల్పడ్డ వారిని గుర్తించినట్లు సమాచారం. దాంతో ప్రభుత్వ ప్రవేటు కళాశాలల నిర్వహకుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఓ ప్రవేటు కాలేజీకి చెందిన విద్యార్థులు సెల్ ఫోన్ చూస్తూ ప్రశ్నలకు జవాబులు సేకరిస్తూ పట్టుబడ్డారు. లీకేజీ ఘటనపై విసిఎస్ మల్లేష్ ఆగరహం వ్యక్తం చేసి దీని బాద్యులపై చర్యలు తప్పవని ప్రకటించారు. అయితే గతంలో పలుమార్లు శాతవాహన యూనివర్సిటీ లో ప్రశ్నల లీకేజీలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
శాతవాహన యూనివర్సిటీ పై ఉన్నత విద్యా మండలి దృష్టి…

Satavahana-University