BJP: తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.. అధికారంలో కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్నామ్నాయమని చెప్పుకున్న బీజేపీ గతంలో కన్నా మెరుగైన సీట్లను, ఓట్ షేర్‌ని సాధించింది. 2018 ఎన్ని్కల్లో 7 శాతం ఓట్ షేర్‌తో కేవలం ఒకే స్థానాన్ని గెలిచిన బీజేపీ ఈ సారి ఏకంగా 14 శాతం ఓట్లను సాధించి 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
Read Also: Ashok Gehlot: సీఎం పదవికి అశోక్ గెహ్లాట్ రాజీనామా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఆదిలాబాద్ – పాయల్ శంకర్, ముధోల్ – రామారావు పటేల్, నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ – పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ – రాజా సింగ్, సిర్పూర్ – పాల్వాయి హరీష్ , కామారెడ్డి – వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. గెలిచిన వారిలో ముగ్గురు బీసీ, ఐదుగురు ఓసీ అభ్యర్థుల ఉన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు టఫ్ ఫైట్ ఇచ్చింది బీజేపీ. కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది.
బీజేపీ రెండో స్థానంలో ఉన్న నియోజకవర్గాలు
1) అంబర్పేట్
2) బోథ్
3) చాంద్రాయణగుట్ట
4) చార్మినార్
5) దుబ్బాక
6) గజ్వేల్
7) హుజురాబాద్
8) కల్వకుర్తి
9) కరీంనగర్
10) కార్వాన్
11) కోరుట్ల
12) మహేశ్వరం
13) మంచిర్యాల్
14) కుతుబుల్లాపూర్
15) రాజేంద్రనగర్
16) సనత్ నగర్
17) సికింద్రాబాద్ కంటోన్మెంట్
18) వరంగల్ ఈస్ట్
19)ఎల్బీనగర్
