Bathukamma 2025 : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్కృతిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, తమిళ్‌నాడు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ, మాజీ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ ప్రాంగణంలో పూలతో అలంకరించిన బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మ పాటల కార్యక్రమాలు నిర్వహించారు. పాల్గొన్న మహిళలు, పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ నృత్యం చేసి, పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కుష్బూ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Pakistan: “భారత్‌తో ఇలానే చేయాలి”, హారిస్ రవూఫ్ ‘6-0’పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు..
