బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్కృతిక ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో అతి పెద్ద వసంత పండుగ బతుకమ్మ ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమవుతోంది. ఆడపడుచులు ఈ పండుగను వివిధ రకాల పూలతో, ప్రత్యేక నైవేద్యాలతో తొమ్మిది రోజులు ఒక్కో పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతుంది. అయితే బతుకమ్మ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంటి? వేటితో ఎలా చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీ లో చూద్దాం. ఎంగిలి పూల బతుకమ్మ: బతుకమ్మ పండుగలో మొదటి…