BJP TRS Clash At Cess Votes Counting Center: వేములవాడ రూరల్ మండలం సెస్ ఎన్నికల ఓటింగ్ లెక్కింపులో గందరగోళం చోటు చేసుకుంది. తొలుత బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి ఏడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత రీకౌంటింగ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు గెలిచారని తెలిపారు. దీంతో.. బీజేపీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కలగజేసుకోవడంతో.. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ నెలకొంది. తద్వారా తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెస్ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు.. భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. 15 స్థానాలకు గాను 4 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫలితంగా.. వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా దేవరాజు గెలుపొందారు.
ZPTC Mallesham Case: జెడ్‌పీటీసీ మల్లేశం కేసులో ట్విస్ట్.. అర్థరాత్రి నుంచే ప్లాన్
ఈ ఎన్నికల కౌంటింగ్‌లో మరో సంఘటన కూడా చోటు చేసుకుంది. కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు వెలుగు చూశాయి. ఆ చిట్టీలో ‘మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీ ముద్దు’ అని రాసి ఉంది. సిరిసల్ల రూరల్ గ్రామాల ఓటర్లు ఈ చిట్టీలు వేసినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. తమకు ఇష్టం లేకుండా మున్సిపాలిటీలో గ్రామాలను వీలినం చేయడంపై.. విలీన గ్రామాల ప్రజలు ముందునుంచే మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ చిట్టీల రూపంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
