NTV Telugu Site icon

BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..

Bjp

Bjp

BJP: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాదిలో సెటిల్ అయ్యారని, కేరళ నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారనే చర్చ సాగుతోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది.

Read also: Pakistan-Iran Conflict: పాకిస్థాన్- ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య..

గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్రలు చేపట్టనున్నారు.ఐదు పార్లమెంట్ క్లస్టర్ల పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. కాగా, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్రంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. మొత్తం 12 మంది అధ్యక్షులను మారుస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 6 ఫ్రంట్‌ల అధ్యక్షులను కూడా మార్చారు.

నూతనంగా నియమితులైన బీజేపీ జిల్లా అధ్యక్షులు:

* మహబూబ్ నగర్ – పి శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్ – గంటా రవి
* నారాయణపేట – జలంధర్ రెడ్డి
* వికారాబాద్ – మాధవరెడ్డి
* నల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
* ములుగు – బలరాం
* నిజామాబాద్ – దినేష్ కుమార్
* పెదపడల్లి – చందుపట్ల సునీల్
* సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
* సిద్దిపేట – మోహన్ రెడ్డి
* యాదాద్రి – పాశం భాస్కర్
* వనపర్తి – డి నారాయణ

6 మోర్చాల అధ్యక్షులు:

* ఎస్టీ మోర్చా – కళ్యాణ్ నాయక్
* OBC మోర్చా – ఆనంద్ గౌడ్
* మహిళా మోర్చా – డాక్టర్ శిల్ప
* కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి
* ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
* యువమోర్చా – మహేందర్
Venkateswara Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది.