NTV Telugu Site icon

Bandi Sanjay: మరో ఆందోళనకు సిద్ధం.. ఈనెల 25న నిరుద్యోగ మహాధర్నా

Bandi Sanjay Dharna

Bandi Sanjay Dharna

BJP To Protest Against TSPSC Paper Leak In The Name Of Unemployment Mahadharna: TSPSC పేపర్ లీకేజీ నేపథ్యంలో బీజేపీ మరో ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ నెల 25వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో ‘నిరుద్యోగ మహా ధర్నా’ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. నిరుద్యోగ యువతతో కలిసి ఈ మహా ధర్నాను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఇతరత్ర విషయాలపై పార్టీ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Gangavva Panchangam: సినీ స్టార్స్‌, రాజకీయ ప్రముఖుల పంచాంగం.. గంగవ్వ నోట..

ఈ సందర్భంగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కారణంగా 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు రెడీ అయ్యారు. సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలపై చర్చించారు. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన్ను బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా బండి సంజయ్ పార్టీ నేతలను కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా సంస్థలను, యూట్యూబ్ ఛానళ్లను బెదిరించడం, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయా సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవడంతోపాటు వారి పక్షాన పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావంగా తెలపాలని నిర్ణయం తీసుకొని.. వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో బృందాన్ని ఏర్పాటు చేశారు.

PM Modi: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొవిడ్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం