Site icon NTV Telugu

BJP Tiffin Box Baithaks: నేడు బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌లు.. అల్పాహారం తెచ్చుకోనున్న కార్యకర్తలు..!

Bjp Tiffin Baithak

Bjp Tiffin Baithak

BJP Tiffin Box Baithaks: నేడు బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌లు నిర్వహించనుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డితో పాటు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు తమ తమ పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కాగా, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలోని పోలింగ్‌ బూత్‌ కేంద్రాలకు ఎవరైనా అల్పాహారం (టిఫిన్‌) తీసుకొచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశాలు నిర్వహించబోమన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ క్యాడర్‌లో సమన్వయం సాధించేందుకు, కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని నేతలు చెబుతున్నారు.

Read also: BRS Rythu Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు..

ఇవాళ ఉదయం అంబర్‌పేట నియోజకవర్గం కాచిగూడలోని 214 పోలింగ్‌ కేంద్రంలో టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంటరీ ఎన్నికల ఇంఛార్జి అభయ్ పాటిల్ సికింద్రాబాద్ అసెంబ్లీలోని మెట్టుగూడ 33-35 పోలింగ్ స్టేషన్లలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట అసెంబ్లీ కోయిల్కొండ 23-27 పోలింగ్ స్టేషన్లలో పాల్గొననున్నారు. కరీంనగర్‌ సాధన స్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌ 174లో ప్రధాన కార్యదర్శి కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గం చిక్కడపల్లి పోలింగ్‌ స్టేషన్‌ 9లో పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ వినాయకగిరి, మల్కాజిగిరిలోని 155-157 పోలింగ్‌ కేంద్రాల్లో, నిర్మల్ అసెంబ్లీలోని గాజులపేట 192 పోలింగ్ కేంద్రంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీలోని నాదర్‌గుల్‌, బడంగ్‌పేట పోలింగ్‌ కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి పాల్గొననున్నారు.
The Family Star: నాలాంటి దాన్ని వాడుకుని వదిలేస్తే ఇంతే.. ఫ్యామిలీ స్టార్ యూనిట్ పై నటి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version