BJP: బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, రాజీవ్ చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింథియా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి ప్రముఖ నేతలు తొలి లిస్టులోనే ఉన్నారు.
Read Also: BJP 1st List: 195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా.. ప్రధానితో పాటు 34 మంది మంత్రులు..
195 మందిలో 34 మంది మంత్రులు, 28 మంది మహిళలకు, 47 మంది యువతకు చోటు దక్కింది. సామాజిక వర్గాల పరంగా చూస్తే..ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 స్థానాలు కేటాయించారు. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు గానూ తొలివిడతలో 9 మంది పేర్లను ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే:
1) బండి సంజయ్- కరీంనగర్
2) అరవింద్ ధర్మపురి- నిజామాబాద్
3) బిబి పాటిల్- జహీరాబాద్
4) ఈటల రాజేందర్- మల్కాజిగిరి
5) కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
6) మాధవి లత- హైద్రాబాద్
7) కొండా విశ్వేశ్వర్ రెడ్డి- చేవెళ్ల
8) భరత్ గౌడ్- నాగర్ కర్నూల్
9) బూర నర్సయ్య గౌడ్- భువనగిరి
