Site icon NTV Telugu

ఇవాళ అమిత్‌షాతో బండి సంజయ్, ఈటల భేటీ !

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును వివరించనున్నారు.

read also : వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతంటే ?

అయితే… ఈ భేటీ స్పందించిన బండి సంజయ్‌… అమిత్‌ షాను కేవలం మార్యాదపూర్వకంగా కలవడానికి మాత్రమే ఢిల్లీ వెళ్తున్నామన్నారు.కాగా… ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన.. నేపథ్యంలో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయిన సంగతి తెలిసిందే.

Exit mobile version