వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతంటే ?

మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా నమోదయ్యాయి. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద కొనసాగుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.72 కు చేరింది.

read also : మహిళలకు షాక్… మరోసారి పెరిగిన బంగారం ధరలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.20 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ. 97.29 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.15 చేరగా.. డీజిల్ ధర రూ. 97.78 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 కాగా డీజిల్‌ ధర రూ. 99.54 గా నమోదైంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-