దేశవ్యాప్తంగా మతతత్వాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ దేశ సామాజిక సామరస్యాన్ని, సమగ్రతను నాశనం చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వరంగల్ పట్టణంలోని కాజీపేటలో ప్రారంభమైన మూడు రోజుల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై మండిపడ్డారు. రాజకీయ మైలేజ్ పొందడం కోసం కాషాయ పార్టీ మతతత్వానికి ఒడిగట్టిందని అన్నారు.
తమ ‘మత విభజన భావజాలాన్ని’ పెంచుకునేందుకు బీజేపీ సమాజాన్ని పోలరైజ్ చేస్తోందని ఆరోపించారు. హిందూ-సైనికీకరణను విశ్వసించిన వీర్ సావర్కర్ అడుగుజాడల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నారని ఏచూరి ఆరోపించారు. మానవ హక్కులు, భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులకు నిరసనగా సీపీఎం ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారం చేపడుతుందని తెలిపారు. “ఒక దేశం, ఒకే ఎన్నికలు” అనే భావన ఫెడరల్ , ప్రజాస్వామ్య విరుద్ధం. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తుంది” అని ఏచూరి పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. భావసారూప్యత గల పార్టీల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా సీపీఎం కేంద్రంపై పోరాటం చేస్తుందన్నారు.
Gajuwaka Assembly constituency : ఆ నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ లేదా?