Site icon NTV Telugu

Bandi Sanjay: ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా?

Bandi Sanjay Mp Arvind

Bandi Sanjay Mp Arvind

Bandi Sanjay: బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లి నిన్న జరిగిన ఘటనపై బండి సంజయ్ ఆరాతీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సహకారంతో టీఆర్‌ఎస్‌ కిరాయి గుండాలు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు. సీఎం కుటుంబ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చేశారని అన్నారు. అరవింద్ నాన అదృష్టవశాత్తూ ఇక్కడ లేరు ఉంటే పరిస్థితి ఏంది.. ప్రమాదం తప్పిందని అన్నారు. హోమో ఫోబియాలో కుటుంబం ఉందని, పోయే కాలం దగ్గర పడ్డదని, ఆ కుటుంబంకి అర్థం అయిందని బండి సంజయ్‌ అన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లక్ష్మి, తులసి, దుర్గ దేవిల ఫోటోల మీద దాడి చేశారన్నారు. హిందువులు అయితే దేవుళ్ళపై దాడి చేయరని మండిపడ్డారు. దేవుళ్ళ మీద దాడి చేసినందుకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read also: Safest investment Plan: సురక్షితమైన పెట్టుబడికి సరైన మార్గం విజయవాడ హైవే

తెలంగాణ సమాజం ఆలోచించాలని, దాడులు భరిద్దామా? అంటూ ప్రశ్నించారు. సెంటిమెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు కానీ కుదరలేదని ఎద్దేవ చేశారు. మహిళల మీద రాయి విసిరారని, అరవింద్ ఆరోపణ వాస్తవం అని తెలంగాణ సమాజం గ్రహిస్తుందని అన్నారు. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని మండిపడ్డారు. ఇళ్ళ మీద దాడులు చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శలు చేయాలి తప్పితే.. దాడి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై దాడులు చేయడం మంచిది కాదు, కుటుంసభ్యులకు రాజకీయాలతో ఏమీ సంబంధం? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో వృద్దులు, చిన్న పిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ప్రాణాలు పోతే ఎవరూ బాధ్యులు? అంటూ ప్రశ్నలతో ముంచెత్తారు.

Read also: God Father: ‘గాడ్ ఫాదర్’ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తారా?

రాజకీయాల కోసం కేసీఅర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారు అంటూ నిప్పుటు చెరిగారు. కేసీఅర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర నుంచి తరిమికొట్టేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారపి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ తక్షణమే ఘటనపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. కేసీఅర్ కుటుంబంలో అంతర్గత ఘర్షణలు ప్రారంభమయ్యాయని అని ఆరోపించారు. కేసీఅర్ ముఖ్యమంత్రి, తండ్రిగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. అమిత్ షా దృష్టికి దాడి ఘటనను తీసుకెళ్లామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రను నమ్ముకున్నారు… మేము చట్టాన్ని నమ్ముకున్నామన్నారు. బండి సంజయ్ కి నోటీసులు, కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నాకు నోటీస్ లు ఇస్తే స్వీకరించేందుకు సిద్దమన్నారు. నేను సీఎం లాగా కుట్రలు చేయడం లేదన్నారు. కాలు విరిగింది అనో కరోనా వచ్చింది అనో తపించుకోనని అన్నారు. తెలంగాణను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని బండిసంజయ్‌ ఆరోపించారు.
Jaggareddy: పీసీసీ మార్పుపై చర్చ చేస్తా.. భవిష్యత్తులో పీసీసీ అవకాశం వస్తే..

Exit mobile version