Site icon NTV Telugu

Bandi Sanjay: కొత్త సచివాలయంలో శాశ్వతంగా దళితుడిని సీఎంగా కూర్చోబెట్టే దమ్ముందా?

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని…ఆయన దుకాణం బంద్ ఖాయమన్నారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని… ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు. గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. గరీబోళ్ల రాజ్యం కావాలో… గడీల రాజ్యం కావాలో…. రామరాజ్యం కావాలో.. రావణ రాజ్యం కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తనను తీవ్రంగా కదలించాయని పేర్కొన్న బండి సంజయ్ అక్టోబర్ 15 నుండి 5 విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు సభాముఖంగా ప్రకటించారు.

బీజేపీ అధికారంలోకొస్తే ప్రజలకు మేలు జరిగే సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంను వీర పట్నంగా మారుస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభకు అశేష జన వాహని తరలి వచ్చింది. అంబర్ మైదానం పూర్తిగా కాషాయ సంద్రమైంది. కేంద్ర గ్రామీణాభివ్రుద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభకు భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తనను తీవ్రంగా కదిలించాయన్నారు. కేసీఆర్ నిర్వహించిన లేటెస్ట్ సర్వేల్లోనూ మునుగోడులో విజయం బీజేపీదేనని తేలిందన్నారు. ఆ భయంతోనే కేసీఆర్ అనేక హామీలతో దళిత, గిరిజనులను మోసం చేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ అని.. అంబేడ్కర్‌ను అవమానించిన పార్టీ టీఆర్ఎస్ అంటూ విమర్శించారు. కొత్త సచివాలయంలో కొత్త కుర్చీలో శాశ్వతంగా దళితుడిని సీఎంగా కూర్చోబెట్టే దమ్ముందా? అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ గా జరపాలని బీజేపీ అనేక దశాబ్దాలుగా పోరాటం చేసిందన్న బండి సంజయ్‌.. బీజేపీ పోరాటంతోనే… టీఆర్ఎస్ పార్టీ చరిత్రను వక్రీకరించే విధంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవానికి’ బదులు ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ గా జరిపిందన్నారు. . పాతబస్తీలో జాతీయ జెండాను పట్టుకుని తిరిగేలా చేసిన ఘనత బీజేపీదేనని ఆయన అన్నారు. . మునుగోడులో ఇంకో ‘ఆర్’ గెలవబోతోందని.. రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తామన్నారు. టీఆర్ఎస్ వెంటిలేటర్‌పై ఉందని.. కేసీఆర్ అందుకే బయటికి వెళ్లడం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు తెలుసన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలను మరోసారి మోసం చేసేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.

ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారన్నారు. బీసీల అభివృద్ధి కి పాటుపడే పార్టీ బీజేపీ. అగ్రవర్ణాలలో పేదలకు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. చేనేత కార్మికులను, గౌడ కులస్తులను, యాదవులు.. ఇలా అన్ని కులాలను నిర్వీర్యం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు. పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంటున్నామన్నారు. మల్కాజిగిరి లో అడుగడుగునా సమస్యలేనన్నారు. బీజేపీ దెబ్బకే… అధికారులు జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డును సందర్శించి, సమస్యను పరిష్కరిస్తామని అన్నారన్నారు. ఈ ఘనత బీజేపీదే. ఓవైసీకి ఉగ్రవాదులు మాత్రమే కనపడతారు తప్ప, బీజేపీ కార్యకర్తలు కనబడరని ఆరోపణలు చేశారు.

Sadhvi Niranjan Jyoti: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు రావడం లేదంటున్న టీఆర్ఎస్, ఎంఐఎంలకు సవాల్ చేస్తున్నా… బలప్రదర్శనకు సిద్ధం… టైమ్, ప్లేస్ చెప్పండంటూ సవాల్‌ విసిరారు. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ, తమ మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి రావాలని… తమ బలమేంటో నిరూపిస్తామన్నారు. గడీల రాజ్యం కావాలా? గరీబోళ్ల రాజ్యం కావాలా? రామరాజ్యం కావాలా? రావణ రాజ్యం కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. పాదయాత్రను అడుగడుగునా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్, కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననన్న ఆయన.. సంక్షేమ పథకాలను తీసేస్తారంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సంక్షేమ పథకాలను ఆపదన్నారు.

 

Exit mobile version