Site icon NTV Telugu

BJP Ramchander Rao : సింగరేణిని ATMలా వాడుకుంటున్నారు

Ramchander Rao

Ramchander Rao

తెలంగాణలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన సొంత ఆస్తిలా వాడుకుందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని బీజేపీ నేత రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి , రాజకీయ పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సింగరేణి సంస్థలో గత పదేళ్లుగా జరిగిన ప్రతి వ్యవహారంపై సిబిఐ (CBI) లేదా సిట్ (SIT) చేత సమగ్ర విచారణ జరపాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. “బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని తమ సొంత ప్రాపర్టీలా వాడుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు తమ అనుచరులకు కాంట్రాక్టులు ఇవ్వాలని, తమకు వాటాలు రావాలని కొట్లాడుకుంటున్నారు” అని ఆయన విమర్శించారు. కోల్ బ్లాక్స్ టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు, అందులో పారదర్శకత ఎందుకు లేదు అనే విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.

Pending Challans : వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ, కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ‘షాడో బాక్సింగ్’ చేస్తున్నాయని రామచందర్ రావు ఆరోపించారు. రెండేళ్ల నుంచి విచారణ జరుగుతున్నా, కేవలం అధికారులనే అరెస్ట్ చేస్తూ రాజకీయ నాయకులను ఎందుకు కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీని ఓడించేందుకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్న అసలైన సూత్రధారులను బయటకు తీసుకురావాలన్నారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర సంస్థలు ఎందుకు వేగంగా స్పందించడం లేదన్న ప్రశ్నకు ఆయన సాంకేతిక కారణాలను వివరించారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో ద్వారా తెలంగాణలోకి సిబిఐ రాకుండా అడ్డుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప సిబిఐ నేరుగా విచారించలేదు. కానీ ఈడీ (ED) కి అటువంటి నిబంధనలు లేవు, అందుకే ఈడీ అనేక కేసుల్లో వేగంగా విచారణ జరుపుతోంది” అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించకపోవడం వల్లే విచారణలో జాప్యం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీలో ఎటువంటి విబేధాలు లేవని, ‘టీమ్ బీజేపీ తెలంగాణ’గా తామంతా ఐక్యంగా ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

Amazon Smart Home విప్లవం.. కొత్త Eco షో సిరీస్‌తో ఇంటికి అత్యాధునిక హంగులు

Exit mobile version